రాగి పూత తో సరికొత్త మాస్క్.. కరోనాకు చెక్..?

-

ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా మాస్క్ లకి తెగ డిమాండ్ పెరిగిపోయిన నేపథ్యంలో ఎన్నో రకాల మాస్క్ లు మార్కెట్లోకి వచ్చి అందరినీ ఆకర్షిస్తున్న విషయం తెలిసింది. ఈ క్రమంలోనే ఎంతోమంది శాస్త్రవేత్తలు కూడా వినూత్నమైన మాస్క్ లను కనిపెట్టేందుకు ఎన్నో రకాల పరిశోధనలు చేస్తున్నారు ఇక ఇటీవల అమెరికాకు చెందిన మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కి చెందిన శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన మాస్కు అభివృద్ధి చేశారు.

ఈ మాస్క్ ను పూర్తిగా రాగి పూతతో తయారు చేసారు పరిశోధకులు. అంతేకాదు ఈ ఎక్కువగా వైరస్ ఉందని భావించినప్పుడు వైరస్ ను చంపేందుకు 9 వోల్ట్ బాటరీ కూడా ఈ మాస్క్ లో అమర్చారు. ముఖ్యంగా సామాజిక దూరం పాటించలేని వారు ఇలాంటి మాస్క్ లు ధరించడం ద్వారా ఎంతో ప్రయోజనం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఆరోగ్య కార్యకర్తలు వైద్యులు ఇలాంటి మాస్క్ ధరించడం ఎంతో మేలు అంటూ సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version