బంగారు తెలంగాణ బీజేపీతోనే సాధ్యం: అమిత్ షా

-

తెలంగాణ, బెంగాల్ రాష్ట్రాల్లో బీజేపీకి అనుకూల వాతావరణం ఏర్పడిందని కేంద్రం హోంమంత్రి అమిత్ షా తెలిపారు. తెలంగాణను
బంగారు తెలంగాణగా మార్చేది బీజేపీ మాత్రమే అని అన్నారు. తెలంగాణ, బెంగాల్‌లో పార్టీని జేపీ నడ్డా మరింత బలోపేతం చేశారని, బూత్ లెవల్ కమిటీలను నిర్మించారని చెప్పారు. నడ్డా నేతృత్వంలోనే వచ్చే పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచి ఘన విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.

అయితే.. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. కర్ణాటకలో మరోసారి అధికారం కైవసం చేసుకోవడంతో పాటు.. తెలంగాణను కూడా తమ అడ్డగా మార్చుకోవాలని ప్రణాళికలు రచిస్తుంది. తద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ విస్తరణను వేగవంతం చేయాలని చూస్తోంది. ఈ ఏడాది జరగనున్న కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటికే బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది. మరోవైపు 2024 సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణాది నుంచి అత్యధిక పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవాలని చూస్తుంది. గత ఎన్నికలకు మించిన మెజారిటీతో కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని భావిస్తుంది. ఈ క్రమంలోనే గత ఏడాది డిసెంబర్ చివరలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా.. పార్టీ లోక్‌సభ ప్రవాస్ ప్రచారానికి సంబంధించిన 2.0ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం పార్టీ బలహీనంగా ఉన్న లోక్‌సభ స్థానాలపై బీజేపీ దృష్టి సారించింది. ఇందులో భాగంగా బీజేపీ ఎక్కువగా దక్షిణాదిపై ఫోకస్ చేసింది.

ఇందులో భాగంగానే పార్టీ అగ్రనాయకులు కొందరిని దక్షిణాది నుంచి బరిలో దింపాలని బీజేపీ అధిష్టానం భావిస్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణ నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను సార్వత్రిక ఎన్నికల బరిలో దింపాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అనేక పరిశీలనల అనంతరం.. పాలమూరు (మహూబ్‌నగర్) నుంచి అమిత్ షాను బరిలో నిలపాలని నిర్ణయానికి వచ్చినట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు బీజేపీ కోర్‌ గ్రూప్‌ సంకేతాలు ఇస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఆరెస్సెస్, సంఘ్‌పరివార్‌ నేతలతో బీజేపీ జాతీయ, రాష్ట్రపార్టీల ముఖ్యుల భేటీ సందర్భంగా ఈ అంశంపై చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version