Avatar 3: ‘అవతార్‌3’ కాన్సెప్ట్‌ అదిరిందిగా..!

-

అవతార్, అవతార్-2 సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులను మరో లోకంలోకి తీసుకెళ్లారు హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్. గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలో ‘అవతార్‌3’ ఎలా ఉంటుంది? అని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ప్రేక్షకుల ఇంట్రెస్ట్ గమనించిన డైరెక్టర్ జేమ్స్ కామెరూన్.. ఏకంగా అవతార్-3 స్టోరీ ఏంటో రివీల్ చేశారు. మరి అదేంటో తెలుసుకుందామా..?

‘‘అగ్ని ఒక చిహ్నం.. ప్రయోజనకారి. మూడో భాగంలో ఇదే ప్రధాన ఇతివృత్తంగా ఉంటుంది. సంస్కృతి మిళతమై కాన్సెప్ట్‌ సాగుతుంది. ఇంతకు మించి చెప్పకూడదేమో. దీంతో పాటు మరో రెండు సంస్కృతులు కూడా మీకు పరిచయం అవుతాయి. ఒమక్టయా, మెట్కైనా తెగలను మీరు కలుస్తారు. పాండోరాలోనే ఇదొక విభిన్నమైన ప్రదేశం’’ అని అన్నారు.

ఇదే విషయమై కామెరూన్‌ సతీమణి ఆసక్తికర కామెంట్‌ చేశారు. ‘మీ సీట్‌బెల్ట్‌ మరింత భద్రంగా ఉంచుకోవాల్సిన అవసరం’ ఉంది అన్నారు. ఈ వ్యాఖ్యలతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. మూడో భాగం పాండోరాలోని ఎడారిలాంటి ప్రదేశంలో సాగుతుందని హాలీవుడ్‌ టాక్‌. అక్కడ ఉండే సంపదను సొంతం చేసుకునేందుకు మనుషులు ఏం చేశారు? జేక్‌, అతడి కుటుంబ వారిని ఎలా అడ్డుకుంది? ఈ క్రమంలో జేక్‌ కుటుంబానికి ఎలాంటి ఆపద కలిగింది? వంటి అంశాలను కామెరూన్‌ మిళితం చేశారని అంటున్నారు. ఏదైమైనా దీని గురించి మరికొన్ని వివరాలు తెలియాలంటే చాలా కాలం ఆగాల్సిందే!

‘అవతార్‌2’తో పాటే ‘అవతార్‌3’ చిత్రీకరణ కూడా జేమ్స్‌కామెరూన్‌ దాదాపు పూర్తి చేశారు. కొంత ప్యాచ్‌ వర్క్‌తో పాటు, కీలకమైన విజువల్‌ ఎఫెక్ట్స్‌ పని మిగిలి ఉంది. ఈ సినిమాను 2024 డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్ర బృందం చెప్పింది. అంటే మూడో భాగం చూడాలంటే దాదాపు రెండేళ్ల పాటు వేచి చూడాల్సిందే! మరోవైపు ‘అవతార్‌: ది వే ఆఫ్ వాటర్‌’ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డులు సృష్టించింది. మొత్తంగా 1.9బిలియన్‌ డాలర్ల (గ్రాస్‌) వసూళ్లు సాధించింది. త్వరలోనే 2 బిలియన్‌ డాలర్ల మార్కును దాటే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version