అధికారంలోకి వస్తాం..సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తాం : అమిత్ షా

-

తెలంగాణ రాష్ట్రం లో 2024 అధికారంలోకి తాము వస్తామని… ఆ తర్వాత తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. మజ్లీస్‌ పార్టీకి బీజేపీ పార్టీ అస్సలు భయపడదని… తెలంగాణ ప్రజలందరికీ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు అని అమిత్‌ షా తెలిపారు.

సర్దార్‌ పటేల్‌ సైనిక చర్య కారణంగానే తెలంగాణ రాష్ట్రానికి స్వేచ్ఛ లభించన్నారు అమిత్ షా. నిజాం రాక్షస పాలను నుంచి తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కలిగిన రోజు సెప్టెంబర్‌ 17 వ తేదీ అని ఆయన పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 17 వ తేదీని.. విమోచన దినోత్సవం గా నిర్వహించాలని అప్పట్లో సీఎం కేసీఆర్‌ డిమాండ్‌ చేశారని… మరి ఇప్పుడు కేసీఆర్‌ డిమాండ్‌ ఏమైం దని నిలదీశారు అమిత్‌ షా. కేసీఆర్‌… విమోచన దినాన్ని ఎందుకు అధికారికంగా నిర్వహిం చడం లేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ ఎవరికీ భయపడుతున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు అమిత్‌ షా.

Read more RELATED
Recommended to you

Exit mobile version