ఈనెల 12న హైదరాబాద్ లో పర్యటించనున్న అమిత్ షా

-

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీ నాయకత్వం దూకుడు పెంచింది. ఇప్పటికే ప్రధాని మోడీ ఆదిలాబాద్, హైదరాబాద్ లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా హోం మినిస్టర్ అమిత్ షా తెలంగాణలో పర్యటించబోతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈనెల 12న HYDలో పర్యటిస్తారని రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా దిశానిర్దేశం చేయబోతున్నారు.

పోలింగ్ బూత్ అధ్యక్షులు, సోషల్ మీడియా ఇన్ఛార్జులతో ఆయన భేటీ కానున్నారని, అనంతరం భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శిస్తారని వెల్లడించారు.రాష్ట్రంలో 12 పార్లమెంట్ స్థానాలను గెలవాలని కమలం పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి, కన్వీనర్ డాక్టర్ కె.లక్ష్మణ్ అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ రాష్ట్ర బిజెపి ఎన్నికల నిర్వహణ కమిటీ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 39 కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version