ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

-

సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తుంది.ఉద్యోగులకు రావాల్సిన PRC, పెండింగ్ డీఏలపై సీఎం చర్చించినట్లు తెలుస్తోంది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యలను సంఘాల నాయకులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. త్వరలోనే పరిష్కరిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎంను కలిసే అవకాశం రాలేదని, కానీ రేవంత్ రెడ్డి తమను సంప్రదించారంటూ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు.

CM Revanth Reddy

‘2008 డీఎస్సీ బాధితులకు ఉద్యోగాలు ఇచ్చే అంశంపై ఈనెల 12న కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటాం అని పేర్కొన్నారు. మరోసారి గవర్నర్తో మాట్లాడి ప్రొ. కోదండరామ్ను ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తాం అని అన్నారు. పాఠశాలలు, కాలేజీలకు ఉచితంగా విద్యుత్ సరఫరా అందిస్తామని, పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్మికులను నియమిస్తాం’ అని ముఖ్యమంత్రి వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version