పౌరసత్వ సవరణ చట్టం మీద పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తప్పు త్రోవ పట్టిస్తున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. బిజెపి సీఏఏ చట్టాన్ని ఆమోదించింది దీంతో ఎలాంటి సమస్య లేదు. కానీ సిఏఏ కోసం దరఖాస్తు చేస్తే పౌరసత్వం కోల్పోతారని మమత చెప్పారు. అందులో వాస్తవం లేదని అన్నారు.
పౌరసత్వం కోసం శరణార్థులు అప్లై చేసుకోవాలని సూచించారు. ఎలాంటి సమస్య లేదని అన్నారు. బెంగాల్లో బాలుర్ ఘాట్ లో బుధవారం జరిగిన ర్యాలీలో అమిత్ షా మాట్లాడారు మమతా బెనర్జీ సిఏఏ ని ఎంత వ్యతిరేకించిన శరణార్థులందరికీ పౌరసత్వం మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో చొరబాట్లని ఆపేందుకు మమత చొరవ తీసుకోలేదని అన్నారు ఎందుకంటే చొరబాటు దారుల ఓట్లే టీఎంసీ కి అత్యధికంగా ఉన్నాయని అన్నారు.