ఓటమి ఉగాది పచ్చడి లాంటిదే..గెలుపు, ఓటమి ఉంటాయని కేటీఆర్ అన్నారు. మేడిపల్లిలో జరిగిన మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సన్నాహాక సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. అనంతరం మాట్లాడారు. ఉగాది పచ్చడిలో మాదిరిగా జీవితంలో అన్ని రకాల రుచులు ఉంటాయి…. రాజకీయ పార్టీ అన్నప్పుడు గెలుస్తాం, ఓడిపోతాం, సంతోషాలు, బాధలు ఉంటాయని చెప్పారు.
ఓడిపోయినంతా మాత్రాన కుంగిపోయేది లేదు.. ప్రజలిచ్చిన ప్రతిపక్ష బాధ్యతను సక్రమంగా నిర్వరిస్తామని… చావునోట్లో తలపెట్టి చావు అంచుకు వెళ్లి తెలంగాణ తీసుకొచ్చింది కేసీఆర్ అని వెల్లడించారు. పదేళ్లు ప్రజలు అవకాశం ఇస్తే తాగునీటి సమస్యలు, కరెంట్ సమస్యలు పరిష్కరించినామని… ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో పాటు కొత్త మెడికల్ కాలేజ్‌లు, గురుకుల స్కూళ్లు ఏర్పాటు చేశామని వివరించారు.
ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇద్దామని ప్రజలు నిర్ణయించుకొని వారిని గెలిపించారు… 420 అబద్దాల హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి ఇవ్వాళ గద్దెనెక్కిండని ఆగ్రహించారు. ఇంట్లో ఇద్దరు ముసళోళ్లు ఉంటే ఇద్దరికి రూ. 4 వేలు ఇస్తా అన్నాడు….మా తమ్ముళ్లకు ఏడాది లోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడని ఫైర్ అయ్యారు కేటీఆర్.