దక్షిణ భారత దేశం వారంటే ఉత్తరాది వారికి ఎప్పుడూ చిన్నచూపే. నిజానికి మన దేశానికి వస్తున్న ఆదాయంలో అధిక శాతం వాటా దక్షిణాది రాష్ట్రాలదే. అయినప్పటికీ కేంద్రానికి దక్షిణాది రాష్ట్రాలంటే ఎప్పుడూ చిన్నచూపే ఉంటుంది.
దక్షిణ భారత దేశం వారంటే ఉత్తరాది వారికి ఎప్పుడూ చిన్నచూపే. నిజానికి మన దేశానికి వస్తున్న ఆదాయంలో అధిక శాతం వాటా దక్షిణాది రాష్ట్రాలదే. అయినప్పటికీ కేంద్రానికి దక్షిణాది రాష్ట్రాలంటే ఎప్పుడూ చిన్నచూపే ఉంటుంది. ఇక మన దేశ భాష హిందీని కూడా ఉత్తరాది వారు దక్షిణాదిపై బలవంతంగా రుద్దాలని ఎప్పటికప్పుడు యత్నిస్తూనే ఉన్నారు. కానీ ఎప్పటికప్పుడు దక్షిణాది రాష్ట్రాలు ఆ యత్నాలను సమర్థవంతంగా తిప్పికొడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి నెలకొన్న హిందీ భాష వివాదం కూడా ఇక సద్దు మణిగినట్లే కనిపిస్తోంది.
దేశమంతా ఒకే భాష ఉండాలని, ఒకే దేశం-ఒకే భాష విధానం ఉంటే బాగుంటుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ఇటీవలే వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. దీంతో దక్షిణాది రాష్ట్రాలన్నీ భగ్గుమన్నాయి. తమిళనాడు నేతలు, సినీ ప్రముఖులైతే ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. తమపై హిందీని బలవంతంగా రుద్దకండి అంటూ నటులు కమలహాసన్, రజినీకాంత్ సహా, ఇతర దక్షిణాది రాష్ట్రాలు ఈ విషయాన్ని ముక్త కంఠంతో ఖండించాయి. దీంతో అమిత్‌షా దిగిరాక తప్పలేదు.
బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో అమిత్‌షా హిందీ విషయంపై స్పందిస్తూ.. తాను హిందీని ద్వితీయ భాషగా నేర్చుకుంటే బాగుంటుందని మాత్రమే వ్యాఖ్యలు చేశానని, ఎవరిపై హిందీని బలవంతంగా రుద్దాలని తాను అనలేదని, కొందరు దీనిపై అవనసన రాద్ధాంతం చేస్తున్నారని, తన మాతృభాష హిందీ కాదని ఆయన అన్నారు. ప్రాంతీయ భాషలు కాకుండా హిందీని మాత్రమే నేర్చుకోవాలని తాను అనలేదని, దీనిపై కొందరు రాజకీయాలు చేసి తమ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని అమిత్‌షా అన్నారు. ఈ క్రమంలో ఇక ఈ విషయంపై స్పష్టత వచ్చినట్లేనని, భవిష్యత్తులో దీన్ని మరోసారి తెరపైకి తెచ్చే అవకాశమే లేదని, దక్షిణాది రాష్ట్రాల అసమ్మతి సెగలు చూశాక.. హిందీ భాష విషయంలో ఇకపై కేంద్ర ప్రభుత్వాలు ఈ అంశాన్ని అసలు టచ్ చేసే అవకాశమే లేదని.. పలువురు అభిప్రాయ పడుతున్నారు..!