మరి కాసేపట్లో అమ్మ ఒడి రెండో విడత.. అకౌంట్లలో 14 వేలే !

ఈరోజు నెల్లూరులో  అమ్మ ఒడి పథకం రెండో ఏడాది చెల్లింపులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు. ఉదయం 9.45 గంటలకు తాడేపల్లి నుంచి బయలు దేరనున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 11.10 గంటలకు నెల్లూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌ కు చేరుకోనున్నారు. 11.30 గంటలకు నెల్లూరు శ్రీ వేణుగోపాలస్వామి కళాశాల మైదానంలో అమ్మ ఒడి పథకం రెండో ఏడాది కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

అనంతరం బహిరంగసభలో సీఎం మహిళలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.  అయితే ఈ సారి తల్లుల అకౌంట్స్ లో రూ.14 వేలు మాత్రమే జమచేయనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆ వెయ్యి రూపాయిలని పాఠశాల మరుగు దొడ్ల నిర్వహణ నిధి కింది మినహాయించనున్నట్టు తెలిపారు. ఆ రూ. 1000 జిల్లా మరుగుదొడ్ల నిర్వహణ నిధికి జమ చేయనున్నట్లు ఉత్వర్వుల్లో పేర్కొన్నారు.