నిమ్స్ లో కలకలం.. ఉరేసుకుని వ్యక్తి మృతి !

హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో కలకలం రేగింది. నిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆసుపత్రి ప్రాంగణంలో చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు ఒక గుర్తు తెలుయని వ్యక్తి. నిమ్స్ మిలీనియం బ్లాక్ వెనుక వైపున చెట్టుకు మృతదేహం వేలాడుతూ కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ విషయాన్ని ముందుగా చూసిన ఆసుపత్రి సిబ్బంది విషయాన్ని పంజాగుట్ట పోలీసులకు తెలియచేశారు.

అయితే అక్కడికి చేరుకున్న పోలీసులు, శవం వేలాడుతున్న తీరు అనుమానాస్పదంగా ఉండటంతో క్లూస్ టీమ్ రప్పించి వివరాలు సేకరిస్తున్నారు. అసలు ఆ వ్యక్తి ఎవరు ? ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు ? అనే విషయం మీద పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఇక అతను ఉరి వేసుకున్న చెట్టు పక్కనే అంబులెన్స్ ఉండడంతో డ్రైవరా ? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.