ఇటీవల కురిసిన భారీ వర్షం హైదరాబాద్ నగరాన్ని మొత్తం ముంచెత్తిన విషయం తెలిసిందే. భారీ వరదలతో పూర్తిగా హైదరాబాద్ నగరం మొత్తం జలదిగ్బంధంలో కి వెళ్ళిపోయింది. జనావాసాల్లోకి కూడా నీళ్లు చేరడంతో ఎటూ పోలేని దుస్థితిలో ప్రజలు అల్లాడిపోయారు. జనజీవనం మొత్తం స్తంభించిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రజలు. వర్షం తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే హైదరాబాద్ నగరం వరద నీటి నుంచి కోలుకుంటున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ప్రజలందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు ఇలాంటి క్రమంలో ఇటీవలే హైదరాబాద్ జిహెచ్ఎంసి అధికారులు అందరూ ప్రజలందరికీ పలు కీలక సూచనలు చేశారు. వర్షం కారణంగా వచ్చిన భారీ వరదల కారణంగా మంచినీటి ట్యాపులు, ట్యాంకులు పూర్తిగా మునిగి పోయిన నేపథ్యంలో ప్రస్తుతం వరద నీరు తో మునిగిన వాటన్నింటిని బ్లీచింగ్ పౌడర్ తో శుభ్రం చేసుకోవడం తో పాటు… క్లోరిన్ కూడా వాడాలి అంటూ అధికారులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసి పరిధిలోని ప్రతి ఇంటికి కూడా బ్లీచింగ్ పౌడర్ క్లోరిన్ సరఫరా చేస్తున్నారు అధికారులు.