TDP కార్యకర్త ఆత్మహత్య…నారా లోకేష్ ఎమోషనల్ పోస్ట్..అన్నా..అన్నా అనే వాడివి !

-

TDP కార్యకర్త ఆత్మహత్య పై ఏపీ మంత్రి నారా లోకేష్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ” అన్నా..అన్నా… అని పిలిచేవాడివి ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయం చేయాలని మెసేజ్ చేసేవాడివి అంటూ ఎమోషనల్‌ అయ్యారు లోకేష్‌. నీకు ఆపద వస్తే ఈ అన్నకి ఒక్క మెసేజ్ చేయాలనిపించలేదా ? అంటూ లోకేష్‌ వెల్లడించారు. దిద్దలేని చాలా పెద్ద తప్పు చేశావు తమ్ముడు ఐ మిస్ యూ అంటూ ఎమోషనల్‌ ట్వీట్‌ చేశారు.

lokesh tweet on tdp activist

నువ్వు ఆత్మహత్య చేసుకున్న సంగతి సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని నిన్ను కాపాడుకునేందుకు చేయని ప్రయత్నం లేదన్నారు. నీ కుటుంబానికి ఓ అన్నగా నేనున్నాను… ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా కష్టసుఖాలను పంచు కుందామని తెలిపారు నారా లోకేష్‌. బతికే ఉందాం ఇంకో నలుగురిని బతికిద్దాం ” అంటూ కార్యకర్త ఆత్మహత్య పై లోకేష్ ఎమోషనల్ పోస్ట్ చేశారు. మంత్రి నారా లోకేష్ చేసిన ఎమోషనల్ పోస్ట్..ఇప్పుడు హల్‌ చల్‌ చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news