ప్రముఖ సింగర్ వాణీ జయరాం అనుమానాధాస్పద స్థితిలో ఆమె ఇంట్లోనే మరణించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆమెది సహజ మరణం కాదు అని.. ఎవరో హత్య చేశారనే పుకార్లు కూడా వినిపించాయి. ముఖ్యంగా తలకు ఒకటిన్నర ఇంచు లోతు గాయం అవ్వడం.. ముఖంపై గాయాలు అవడంతో పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేశారు.. కానీ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆమె మరణం మీద ఎటువంటి అనుమానాలు లేవని సహజంగానే మరణించింది అంటూ తాజాగా వచ్చిన రిపోర్ట్స్ పరిగణలోకి తీసుకొని వారు నిర్ధారణకు వచ్చారు.. అయితే ఈ విషయంలో కూడా ఎన్నో అనుమానాలు అలాగే ఉన్నాయి. ఆమె ఎలా మరణించారో ప్రాణం పోవడానికి గల కారణాలను ప్రముఖ అనలిస్టు దాసరి విజ్ఞాన్ వివరించారు.
ఆయన మాట్లాడుతూ.. వాణీ జయరాం గారు మరణించడానికి కారణం ఆమె రూములో ఉన్న గ్లాస్ టేబుల్.. ఆమె కాలుజారి గ్లాస్ టేబుల్ పై పడటంతో తల ముందు భాగంలో గ్లాస్ టేబుల్ తగిలి గాయమై రక్తం బాగా పోయి ఆమె మరణించారు. సాధారణంగా మనం అలంకరణ వస్తువులకు వాడే గ్లాస్ వస్తువులకి గ్లాస్ చాలా మందంగా ఉంటుంది అంత సులభంగా పగలదు కానీ ఆమె ఇంట్లో ఉన్న టేబుల్ అంత త్వరగా ఎలా పగిలిందో అర్థం కావడం లేదు అంటూ ఆయన తెలిపారు..
ఇక ఆమె అంత్యక్రియలకు కూడా ఎవరు బంధువులు రాలేదు. దానికి కారణం ఆమె పిసినారి తనమే అనే కామెంట్లు కూడా వినిపించాయి. ఏది ఏమైనా ఆమె మరణం ఇండస్ట్రీ కే బాధాకరం అంటూ దాసరి విజ్ఞాన్ చేసిన ఈ కామెంట్ లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.