ష‌ర్ట్, ప్యాంట్ తొడుక్కున్న ఏనుగు.. వైర‌ల్ పిక్‌ను షేర్ చేసిన ఆనంద్ మ‌హీంద్రా..

-

సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను షేర్ చేసే మ‌హీంద్రా గ్రూప్ చైర్మ‌న్ ఆనంద్ మ‌హీంద్రా ఈసారి ఫ‌న్నీ పిక్‌ను షేర్ చేశారు. ష‌ర్ట్‌, ప్యాంట్ ధ‌రించిన ఓ ఏనుగు ర‌హ‌దారిపై వెళ్తున్న ఫొటోను ఆయ‌న షేర్ చేశారు. అందులో ఏనుగు హుందాగా వెళ్తుండ‌డాన్ని గ‌మ‌నించవ‌చ్చు. ఆయ‌న ఆ పిక్‌ను షేర్ చేయ‌గానే తెగ లైక్‌లు వ‌స్తున్నాయి.

ష‌ర్ట్‌, ప్యాంట్ ధ‌రించిన ఏనుగు ఫొటోను షేర్ చేసిన ఆనంద్ మ‌హీంద్రా దానికి క్యాప్ష‌న్ కూడా పెట్టారు. Incredible India. Ele-Pant… అని కామెంట్ చేశారు. ఇక ఆ ఫొటో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. దానికి నెటిజ‌న్లు లైక్‌లు కొడుతూ షేర్లు చేస్తున్నారు. అనేక మంది ర‌క‌ర‌కాల కామెంట్ల‌ను కూడా పెడుతున్నారు.

ఆనంద్ మ‌హీంద్రా షేర్ చేసిన ఆ పిక్‌కు ఇప్ప‌టికే 3వేల‌కు పైగా లైక్స్ వ‌చ్చాయి. సోష‌ల్ మీడియా యూజ‌ర్లు ఆ పిక్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఏనుగు భ‌లే మోడ్ర‌న్ డ్రెస్ వేసిందే.. అని ఒక యూజ‌ర్ కామెంట్ చేయ‌గా.. ఏనుగు ప్యాంట్ తొడుక్కుంది, మావ‌టి లుంగీ ధ‌రించాడు.. అని ఇంకో యూజ‌ర్ కామెంట్ చేశాడు. ఇలా ర‌క ర‌కాల ఫ‌న్నీ కామెంట్స్ వ‌స్తున్నాయి.

కాగా ఆనంద్ మ‌హీంద్రా ఇటీవ‌లే ఆటోపై ఇంటిని నిర్మించిన ఓ వ్య‌క్తి గురించిన వివ‌రాల‌ను షేర్ చేస్తూ అత‌న్ని క‌ల‌వాల‌ని ఉంద‌ని అన్నారు. మ‌రి అత‌న్ని ఆయ‌న క‌లిశారో లేదో తెలియ‌దు. క‌లిస్తే ఆయ‌న ఆ వివ‌రాల‌ను షేర్ చేస్తార‌ని ఆశించ‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version