విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ ల కాంబినేషన్ లో వచ్చిన లైగర్ సినిమాతో అనన్య పాండే టాలీవుడ్ కి పరిచయం అయింది. అయితే ఈ మధ్యన అనన్య గురించి చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి, ముఖ్యంగా ఆదిత్య రాయ్ కపూర్ తో ఈమె స్పెషల్ రిలేషన్ లో ఉందన్న వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. అయినప్పటికి అనన్య పాండే మరియు ఆదిత్య కపూర్ లు పెద్దగా పట్టించుకున్నది లేదు. కానీ ఇటీవల అనన్య పాండే సారా అలీ ఖాన్ తో కలిసి కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న కాఫీ విత్ కరణ్ షో కు హాజరయ్యారు. ఈ షో లో కరణ్ అడిగిన ఈ ప్రశ్నకు అనన్య పాండే స్పందిస్తూ.. అవును నేను కూడా విన్నాను, కానీ మీరందరూ అనుకుంటున్నట్లు మా ఇద్దరి మధ్య అలంటి రిలేషన్ ఏమీ లేదు.
మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అంటూ క్లారిటీ ఇచ్చింది. ఈమె ఈ షో లో చెప్పిన ఒక్క మాటతో వీరిద్దరి మధ్య ఉన్నవి కేవలం రూమర్ లు మాత్రమే.. ఇందులో నిజం ఏమీ లేదని తేలిపోయింది.