స్టేజీపైనే హైపర్‌ ఆది బట్టలు విప్పిన అనసూయ..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలో యాంకర్‌ ఓంకార్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాంకర్‌ గా తన కంటూ ఓ ప్రత్యేకతను చాటు కున్నాడు ఓంకార్‌. ప్రస్తుతం ఓంకార్‌ స్టార్‌ మా ఛానల్‌ లో ప్రసారమయ్యే సిక్త్‌ సెన్స్‌ సీజన్‌ 4 కు హోస్ట్‌ గా వ్యవహరిస్తున్నారు. ఈ షో జూన్‌ 12 వ తేదీ నుంచి నాలుగో సీజన్‌ ప్రారంభం అయింది. అయితే.. తాజాగా ఈ షోకు అనసూయ మరియు హైపర్‌ ఆది గెస్టులుగా హాజరయ్యారు. జబర్దస్త్‌ షోలో తనదైన శైలిలో పంచ్‌ వేసి నవ్వించే హైపర్‌ ఆది… ఈ షోలోనూ చాలా కామెడీ చేశాడు.

అయితే.. ఈ షోలో హైపర్‌ ఆది బట్టలను యాంకర్‌ అనసూయ విప్పుతుంది. టాస్క్‌ లో భాగంగా… చాలెంజ్‌ ను ఓడిపోతాడు హైపర్‌ ఆది. ఈ నేపథ్యం లోనే ఆది బట్టలను గెలిచిన అనసూయ విప్పి…. వాషింగ్‌ మిషన్ లో వేస్తుంది. ప్యాంట్‌ కూడా విప్పేస్తా అని అనసూయ అంటే.. వద్దంటూ ఆది చెబుతాడు. ఇక షర్ట్‌ లేకుండానే ఆ షో మొత్తం ఆది మనకు కనిపిస్తాడు. ఇక అనసూయ చేసిన పనికి… ఆదికేశవ రెడ్డి లా వచ్చిన నన్ను అర్జున్‌ రెడ్డి చేశారంటూ బోరుమంటాడు ఆది. ప్రస్తుతం ఆ ఇన్సిడెంట్‌ కు సంబంధించిన ఫోటోల్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.