ప్రముఖ యాంకర్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా తన అంద చందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా జబర్దస్త్ వంటి కార్యక్రమాలలో ఎక్కువగా అనసూయ అందాలను చూడడానికే అభిమానులు ఎక్కువగా జబర్దస్త్ కార్యక్రమాన్ని చూస్తారు అనడంలో సందేహం లేదు. అంతగా తన నటనతో , అందాల ఆరబోతతో మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా ఇటీవల యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో విపరీతంగా పాపులర్ అయింది. అందుకు కారణం లైగర్ రిజల్ట్ ను చూసి అనసూయ పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు ఊహించిన విధంగా వైరల్ అయ్యాయి.
ఈ క్రమంలోనే అనసూయ తన సహనాన్ని కోల్పోయి ఇప్పుడు అన్నంత పని చేసింది.. ఇన్ని రోజులూ ఏమన్నా మారుతారేమో అని ఎదురు చూశాను.. కానీ అసభ్యకరమైన పదజాలంతో బాడీ షేమింగ్ చేస్తున్న వారు ఏమాత్రం మారలేదు. అందుకే ఇప్పుడు సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేయడం తప్పలేదు అంటూ ఆమె తెలిపింది. ఇక వెంటనే మద్దతు ఇచ్చిన సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు కూడా తీసుకుంటామని తెలిపారు. అయితే ఇదే విషయాన్ని అనసూయ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఇకపోతే నెటిజన్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొక్క తప్పదు అని తెలుస్తోంది.