కళ్లుచెదిరే అందంతో మాల్దీవులు వెకేషన్ లో అందాలు ఆరబోస్తున్న యాంకర్ దీపిక పిల్లి..

-

మెరిసిపోయే అందాలతో.. రెచ్చగొట్టే ఒంపసొంపులతో మాల్దీవ్స్ వెకేషన్ లో రచ్చ చేస్తుంది యంగ్ యాంకర్ దీపికా పిల్లి.. హాట్ ట్రెండీ వేర్ ధరించి చూసే అభిమానులకు పిచ్చెక్కిస్తుంది. పొట్టిగౌనులో అందాలు ఆరబోస్తున్న దీపికా పరువాలు యువతకు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి..

డాన్స్ రియాల్టీ షో ఢీ సీజన్ 13 లో యాంకర్ రష్మికతో పాటు యాంకరింగ్ చేసి దీపికా పిల్లి ప్రేక్షకులకు దగ్గరయ్యారు.. ఈ ప్రోగ్రాంతో ఆమెకు విపరీతంగా అభిమానులు పెరిగారు. బుల్లితెరపై రష్మీ, సుడిగాలి సుధీర్ కెమిస్ట్రీ ఎంత బాగా వర్కౌట్ అయిందో దీపికా పిల్లి, హైపర్ ఆది కెమిస్ట్రీ కూడా అంతే బాగా కుదిరింది. తన అందంతో, అభినయంతో విపరీతమైన క్రేజ్ సంపాదించిన దీపిక.. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా రెచ్చిపోతుంది.. నెట్టింట్లో ఏమాత్రం తగ్గకుండా తన అందాలను ఆరబోస్తోంది. క్రేజీ అవుట్ ఫిట్స్ తో చూసేవాళ్ళకు కనులు విందు చేస్తుంది..

దీపిక ఢీ సీజన్ 14 నుంచి తప్పుకున్నాక.. రష్మీ, సుధీర్ కూడా ఆ షో నుంచి బయటకు వచ్చేసారు. అయితే అప్పటివరకు ప్రేక్షకులకు కన్నులు విందు చేసిన వీళ్లు ఒక్కసారిగా కనిపించకపోవడంతో ప్రేక్షకులు నిరాశ చెందారని చెప్పవచ్చు. అయితే బుల్లితెరపై కనిపించడం తగ్గినా.. సోషల్ మీడియాలో మాత్రం తగ్గేదే లేదు అంటూ దూసుకుపోతుంది ఈ భామ. తాజాగా మాల్దీవులు వెకేషన్ కు వెళ్లిన దీపిక అందాలు ఆరబోసింది.. కళ్ళు చెదిరే అందంతో పొట్టి స్కట్లో ప్రేక్షకులకు విందు చేసింది.. అయితే ప్రస్తుతం దీపిక బుల్లితెరపై కన్నా వెండితెరపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.. ఇటీవలే విడుదలైన వాంటెడ్ పండుగాడు చిత్రంలో దీపిక హీరోయిన్గా నటించింది. కె. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ చిత్రం అట్టర్ ఫ్లాప్ గా మిగిలిపోయింది.. జబర్దస్త్ కామెడీ కన్నా ఘోరంగా ఉందంటూ ఈ సినిమాను విపరీతంగా ట్రోల్ చేశారు.. అనసూయ, విష్ణు ప్రియ కూడా ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో కనిపించారు. అయితే ఈ సినిమా డిజాస్టర్ అయిన ఏమాత్రం తగ్గేదే లేదు అంటుంది దీపికా.. మరిన్ని అవకాశాల కోసం సోషల్ మీడియాను ఎంచుకొని తను అందాలనే ఆయుధంగా చేసుకుంటుంది. అయితే ఏది ఏమైనా దీపికా ఎదిగిన తీరు చాలా మందికి స్ఫూర్తి అనే చెప్పవచ్చు.. టిక్ టాక్ స్టార్ గా ఫేమస్ అయిన ఈమె.. బుల్లితెర యాంకర్ స్థాయికి వెళ్ళింది. నటిగా తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ సినిమాలు చేస్తున్నారు. ఆమె సోషల్ మీడియా ఫాలోయింగ్ చూసి మల్లెమాల వాళ్ళు యాంకర్ గా అవకాశం ఇచ్చారు. అలాగే మరిన్ని అవకాశాలతో ముందుకు వెళ్లాలని చూస్తున్న దీపిక ప్రయాణం ఎంతవరకో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Deepika Pilli (@deepika_pilli)

 

View this post on Instagram

 

A post shared by Deepika Pilli (@deepika_pilli)

Read more RELATED
Recommended to you

Latest news