ఆ విషయంలో నిరుత్సాహపడుతున్న యాంకర్ సుమ.. కారణం..?

-

బుల్లితెర మహారాణిలా దూసుకుపోతున్న యాంకర్ సుమ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యాంకర్ గా ఎన్నో షో లకు వ్యవహరిస్తూ బుల్లితెరపై మంచి ఇమేజ్ ను కూడా సొంతం చేసుకుంది. ముఖ్యంగా స్టార్ మహిళ , క్యాష్ వంటి షో లతో ఎంతో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈమె.. వాటి టిఆర్పీ రేటింగ్ కూడా అమాంతం పెరిగిపోయాయని చెప్పవచ్చు. ఇక మలయాళం నుంచి వచ్చిన ఈమె మొదట్లో సినిమాలలో నటించింది.. అయితే అవకాశాలు పెద్దగా రాకపోవడంతో మళ్లీ బుల్లితెరపై సీరియల్స్ లో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఇక ఆ తర్వాత భలే చాన్సులే ప్రోగ్రామ్ కి హోస్ట్ గా పని చేసే అవకాశాన్ని సొంతం చేసుకుని .. ఇక ఆ తర్వాత తన సత్తా ఏంటో చూపించింది సుమ.Rajeev Kanakala - Anchor Suma Divorced: Truth Here

బుల్లితెరపై వరుస ప్రోగ్రామ్లకు హోస్ట్ గా వ్యవహరించే అవకాశాన్ని సొంతం చేసుకుంటూ అతి తక్కువ సమయంలోనే ఒక్కొక్క షోకి రూ.2.5 లక్షల పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగింది సుమ. అంతేకాదు బుల్లితెరపై ఎంత మంది యాంకర్ లు వస్తున్నప్పటికీ ఈమెను ఢీ కొట్టేవారు లేరు అని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఒకవైపు బుల్లితెర పై పలు ప్రోగ్రామ్లకు హోస్టుగా వ్యవహరిస్తూనే.. మరోపక్క సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లకు హాజరు అవుతూ వాటిని సక్సెస్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఈమెకు అటు సినిమా రంగంలో ఇటు బుల్లితెర రంగంలో మంచి ఇమేజ్ ఉండటంతో నిర్మాతలు ఈమె కోసం ప్రత్యేకంగా కథను సిద్ధం చేయించి మరి జయమ్మ పంచాయతీ అనే సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ సినిమాపై కూడా ఈమెకు మంచి కాన్ఫిడెంట్ కూడా ఏర్పడింది. కానీ ఈ సినిమా విడుదలయ్యి నష్టాల బాట పట్టింది అని చెప్పవచ్చు. పెట్టిన పెట్టుబడిలో కేవలం 4.3 కోట్ల రూపాయలను మాత్రమే ఈ సినిమా కలెక్షన్లు రాబట్టి పూర్తిస్థాయిలో నష్టాన్ని మిగిల్చింది.Mahesh Babu unveils Suma Kanakala's Jayamma Panchayathi trailer | Entertainment News,The Indian Expressఇక ఈ సినిమా విషయంలో అప్సెట్ అయిన సుమ ఇప్పుడు నిర్మాతలు కూడా ఈమె కి కీలక పాత్రలో నటించడానికి అవకాశాలు ఇస్తూ ఎక్కువ పారితోషకం ఇస్తామని ఆఫర్ చేసినప్పటికీ సినిమాలలో నటిస్తే ఇక ఇమేజ్ పోతుందని అందుకే బుల్లితెరను వీడడం ఇష్టం లేక సినిమా ఆఫర్ లను కూడా రిజెక్ట్ చేస్తోంది సుమ కనకాల.

Read more RELATED
Recommended to you

Latest news