యాంకర్ ప్రదీప్ మరియు శ్రీముఖి గురించి తెలియని వారుండరు. టీవీ యాంకర్లుగా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ ఉంటారు. అంతేకాదు.. తెరపై వీళ్లిద్దరు చేసే హంగామా మాములుగా ఉండదు. అయితే.. తాజాగా ఈ జంటపై ఓ వార్త వైరల్ అవుతోంది. యాంకర్ ప్రదీప్, శ్రీముఖి పెళ్లి పీట లెక్కబోతున్నారట. ఈ మేరకు వీళ్లిద్దరి ఇంటి పెద్దలు కూడా వివాహనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. కరోనా వైరస్ ఉధృతి ఉన్న నేపథ్యంలో… ఈ సమయంలో పెళ్లి వద్దనుకున్నారట.
అయితే.. సెప్టెంబర్ లో మంచి ముహుర్తాలు ఉన్నందున… ఆ మాసంలోనే పెళ్లికి చేసుకోవాలని ఇద్దరు ఫిక్స్ అయ్యారని టాక్. అంతేకాదు.. సెప్టెంబర్ 2 న పెళ్లి అని కూడా ఓ వార్త వైరల్ అవుతోంది. అయితే… దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఇది ఇలా ఉండగా… ఓ వైపు రియాలిటీ షోలు చేస్తూనే.. మరోవైపు సినిమాలతో అలరిస్తున్న ప్రదీప్, శ్రీముఖి మధ్య ఏదో ఉందని కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు శ్రీముఖి యాంకర్‌గా ప్రస్థానం మొదలుపెట్టింది కూడా ప్రదీప్తోనే కావడం విశేషం.