పునర్నవికి షాక్‌.. శ్రీముఖితో జ‌త క‌ట్టిన‌ రాహుల్ సిప్లిగంజ్

-

ఇటివలే తెలుగు బిగ్ బాస్ మూడో సీజన్ ముగిసిన విష‌యం తెలిసిందే. ఈ షోలో రాహుల్ విన్నర్ కాగా.. శ్రీముఖి రన్నర్ గా నిలిచింది. 17 మంది కంటెస్టెంట్స్‌తో 106 రోజుల పాటు బిగ్ బాస్ హౌస్‌ను తన ఆటపాటలతో హుషారెత్తించిన రాములమ్మకు బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ ఖాయమే అనుకున్నారంతా. అయితే అనూహ్యంగా చివరి వారాల్లో పుంజుకున్న రాహుల్ సిప్లిగంజ్‌ టైటిల్‌ను. అయితే బిగ్ బాస్-3 రియాల్టీ షో అనేక ఆసక్తికర పరిణామాలకు వేదికగా నిలిచింది. పునర్నవి-రాహుల్ సిప్లిగంజ్ మధ్య అనుబంధం ఎంత రక్తికట్టించిందో, రాహుల్ సిప్లిగంజ్-శ్రీముఖి మధ్య పోరు అంతే ఆసక్తి కలిగించింది. అనేక వాదోపవాదాలతో బిగ్ బాస్ ఇంటిని రాహుల్, శ్రీముఖి వేడెక్కించారు.

బిగ్ బాస్ ఇంట్లో పరిస్థితులు వారి మధ్య వివాదాలకు కారణం అయ్యాయి. అయితే, ఇప్పుడు వారిద్దరూ కలిసి ఉన్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. “అసలు రిలేషన్ ఇప్పుడే మొదలైంది” అంటూ రాహుల్ పోస్టు చేసిన సెల్ఫీ ఫొటోకు విపరీతమైన స్పందన వస్తోంది. శ్రీముఖి కూడా ఇదే ఫొటోను పోస్టు చేసింది. దీనికి “గతం గతః” అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు. దీంతో రాహుల్, శ్రీముఖి రిలేషన్ ఇలా ఉంటే మరి మధ్యలో పునర్నవి ఎక్కడికి పోయిందంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వాస్త‌వానికి రాహుల్‌, పున్ను రిలీష‌న్ తెలిసిందే. ఇక వీరిద్ద‌రి మ‌ధ్య‌లోకి శ్రీ‌ముఖి రావ‌డంతో పున్నూకి పెద్ద షాక్ త‌గిలింద‌నే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news