యాంకర్ శ్రీముఖి ఇంట తీవ్ర విషాదం

టాలీవుడ్‌ నటి, ప్రముఖ యాంకర్‌ శ్రీ ముఖి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సోమ వారం రోజున శ్రీ ముఖి.. అమ్మమ్మ తీవ్ర అనారోగ్యం తో మృతి చెందారు. దీంతో యాంకర్‌ శ్రీ ముఖి… ఎమోషనల్‌ అయింది. అమ్మమ్మ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్‌ మీడియా లో ఓ పోస్ట్‌ చేసింది.

“అమ్మమ్మ అంటే నాకు ఇష్టం. జీవితంలో చాలా విషయాలను తన నాకు చెప్పింది. అమ్మమ్మ ఎప్పుడూ హుషారుగా ఉండేది. ఎల్లప్పుడూ సంతోషాన్ని అందరికీ పంచేది. అమ్మమ్మ చాలా ధైర్య వంతురాలు, జీవితంలో నువ్వు ఇచ్చిన ప్రతి దానికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎప్పుటికీ నిన్ను గుర్తు పెట్టుకుంటాను అమ్మమ్మ ” అంటూ ఎమోషనల్‌ అయింది యాంకర్‌ శ్రీ ముఖి. ఇక శ్రీముఖి అమ్మమ్మ మరణానికి సంతాపం తెలుపుతూ పలువురు ప్రముఖులు కూడా సంతాపం తెలిపారు. కాగా… నిన్నటి రోజులన నటుడు ఉత్తేజ్‌ సతీమణి క్యాన్సర్‌ తో మృతి చెందిన సంగతి తెలిసిందే.