అలాంటి కామెంట్లను పట్టించుకోవద్దు.. యాంకర్ సుమ సందేశం

-

మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు యాంకర్ సుమ సందేశమిచ్చింది. అసలే క్షణం తీరిక లేకుండా బిజీగా గడిపే యాంకర్ సుమ ఈమధ్య సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. సుమక్క అంటూ ఓ యూట్యూబ్ చానెల్‌ను కూడా రన్ చేస్తోంది. అప్పుడప్పుడు లైవ్‌లోకి వచ్చి అభిమానులతో ముచ్చటిస్తుంది. తాజాగా ఉమెన్స్ డే స్పెషల్‌గా లైవ్‌లోకి వచ్చి మహిళలందరికీ ఓ మెసెజ్ ఇచ్చింది.

మహిళా దినోత్సవం సందర్భంగా ఓ వీడియో పెట్టాలని అనుకున్నానను వెంటనే.. ఓ ఆలోచన వచ్చిందని చెప్పుకొచ్చింది. ఈ రోజు మేకప్‌ వేసుకోలేదు కదా.. వేసుకోకపోతే ఎలా అనుకున్నానని తెలిపింది. అయితే, మేకప్‌ లేకపోతే సుమ ఇలా ఉంటుంది.. కళ్లేంటి కొంచెం డల్‌గా  ఉన్నాయి? అని రకరకాలుగా అంటారని పేర్కొంది. ఇది తన కష్టార్జితమని చెప్పుకొచ్చింది. రెమ్యునరేషన్‌తో పాటు ముఖం ఇలా మారిపోతూ ఇలాంటి ప్రతిఫలాలు కూడా వస్తుంటాయని సుమ తెలిపింది.

ఇలా ఎంతో మంది మహిళలు తమ ఇంటిని, వర్క్‌ను బ్యాలెన్స్ చేస్తుంటారని తెలిపింది. ఇంకొంతమంది ఇంట్లోనే గొడ్డు చాకిరి చేస్తుంటారని అయినా వారిపై కూడా కామెంట్లు చేస్తుంటారంది. ఏంటీ నల్లబడ్డావు.. బాగా చిక్కిపోయావేంటీ? బాగా లావయ్యావేంటీ? అంటుంటారని చెప్పుకొచ్చింది. బయటి నుంచి వచ్చే కామెంట్లను మనం మార్చలేమని. ఎలాంటి కామెంట్లు వచ్చినా మనం ఇలాగే ఉండాలని, ఎలాంటి వ్యాఖ్యలు వచ్చినా మహిళలంతా మారొద్దు.. ఆనందంగా ఉండండి. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంటూ ముగించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version