టాలీవుడ్లో హాట్ యాంకర్లు అన్న ముద్ర వేయించుకున్న రష్మీ గౌతమ్, అనసూయ భరద్వాజ్ ఇద్దరు బుల్లితెర నుంచి వెండితెరమీదకు ఎంట్రీ ఇచ్చారు. సినిమా తెరపై ఓ వెలుగు వెలిగి పోవాలని ఎన్నో కలలతో ఎంట్రీ ఇచ్చిన వీరిద్దరు ఒకటీ అరా సినిమాలతో మెప్పించినా ఆ తర్వాత వరుసపెట్టి పసలేని కథలను ఎంచుకుంటూ సినిమాలు తీస్తూ ప్రేక్షకులను విసిగెత్తిస్తున్నారు. చివరకు వీళ్లు కథాంశం ఉన్న సినిమాలు వదిలేసి అందాల ఆరబోతకే ప్రాధాన్యం ఇస్తున్నట్టే కనపడుతోంది.
తాజాగా వారం రోజుల వ్యవధిలో ఈ ఇద్దరు నటించిన రెండు సినిమాలు వచ్చాయి. రష్మీ శివరంజనీ గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చి అట్టర్ ప్లాప్ అయ్యింది. ఈ సినిమా రష్మీ ఎందుకు చేసిందో ? ఎవ్వరికి తెలియదు. సినిమాలో కథ, కథనాల కంటే రష్మీ అందాల ఆరబోతకే ప్రాధాన్యం ఇచ్చినట్టు ఉంది. ఇక వాళ్లు కూడా తమ అందాలు చూసేందుకే ఓ టైప్ ప్రేక్షకులు సినిమాలకు వస్తారని భావించి నటన కంటే అందాలు చూపించేందుకు డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది.
ఇక ఈ శుక్రవారం అనసూయ నటించిన కథనం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇండస్ట్రీలో డైరెక్టర్‌గా మారాలనుకునే అమ్మాయిగా నటించింది. ఆమె కథనాన్ని ఎలా రాసుకుంటుందో.. నగరంలో అదే విధంగా హత్యలు జరుగుతూ ఉంటాయి. మరి ఆ హత్యలకు, అనుకు ఉన్న సంబంధం ఏమిటి? అన్న కాన్సెఫ్ట్‌తో ఈ సినిమా తెరకెక్కించారు.సినిమా నిండా అనవసరమైన సన్నివేశాలు, ఇరికించినట్లు అనిపించే కామెడి.. ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తాయి.
వెన్నెల కిషోర్‌తో చేయించిన కామెడీ లైన్ కూడా పెద్దగా నవ్వించలేకపోయింది. ఓవరాల్‌గా అనసూయ తన హాట్నెస్ చూపించేందుకే తాపత్రయ పడిందన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఏదేమైనా ఈ ఇద్దరు హాట్ హీరోయిన్లు హాట్‌నెస్‌తో పోటీ పడడానికే సినిమాలు చేస్తున్నట్టు ఉందన్న సెటైర్లు టాలీవుడ్లో పడుతున్నాయి. ఉన్నంతలో కాస్త అనసూయే నటనకు స్కోప్ ఉన్న పాత్రలు చేస్తున్నా రష్మీ మరీ ఘోరం.