అడ్డంగా బుక్క‌యిన ద‌మ్మున్న రాత‌లు.. ఆరోప‌ణ‌ల నిరూప‌ణ ఎక్క‌డ..‌?

-

ఏపీలోని జ‌గ‌న్‌ స‌ర్కారుపై ఆది నుంచి క‌త్తిక‌ట్టిన ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌లో స‌ర్కారీ వారికి వ్య‌తిరేక వార్త‌లు రా వ‌డం నిత్య‌కృత్యంగా మారిపోయింది. రోజూ ఏదొ ఒక రాయి విసిరితేనే త‌ప్ప స‌ద‌రు ద‌మ్మున్న ప‌త్రిక అ ధినేత కు నిద్ర ప‌ట్ట‌డం లేద‌నే ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. తాజాగా ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా అచ్చోసి న క‌థ‌నం లో అస‌లు విష‌యాన్ని నిరూపించ‌లేక పోయింది. జ‌గ‌న్ ప్ర‌భుత్వం దేశం దాటి అప్పులు చే స్తోంద‌ని, దీనిని సొంత అవ‌స‌రాల‌కు మ‌ళ్లించేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఈ ప‌త్రిక ప్ర‌ధాన వార్త‌గా దీనిని ప్ర‌క‌టించింది.

అయితే, ఈ క్ర‌మంలో ప‌త్రికే రాసిన ఓ పాయింట్ అత్యంత కీల‌కం. మొత్తం క‌థ‌నానికి అదే బ‌లం కూడా! అ యితే, అస‌లు ఆ పాయింటే లేకుండా స్టోరీ ముగిసిపోవ‌డం గ‌మ‌నార్హం. దీనిని చ‌దువుకున్న స‌గ‌టు పా ఠ‌కు డు.. “ద‌మ్మంటే ఏంటో అనుకున్నాం.. తుస్సే!“ అని సోష‌ల్ మీడియాలో కామెంట్లు చేస్తున్న ప‌రిస్థి తి నెల కొంది. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేయడంలోనూ కొత్త పుంతలు తొక్కుతోంది. రకరకాల మార్గాల్లో అప్పులు సేకరిస్తూనే… ఇప్పుడు  ‘ప్రైవేటు’ రుణాలకూ ప్రయత్నం చేస్తోంది. అలా అప్పుగా తెచ్చుకున్న డబ్బులను సాగునీటి ప్రాజెక్టులు, వైద్య కళాశాలల నిర్మాణం వంటి పనులకోసం ఉపయోగిస్తారట! అని క‌థ‌నం రాశారు.

అయితే, ఈ క్ర‌మంలోనే ఉప‌శీర్షిక‌ల్లో ఓ కీల‌క మైన అంశాన్ని పేర్కొన్నారు. “రాష్ట్ర ప్రభుత్వం మొట్ట మొద టి సారిగా, ఒక వినూత్నమైన ‘అప్పుల ఆలోచన’ చేస్తోంది. అది… విదేశాలకు చెందిన ప్రైవేటు ట్రస్టు నుంచి రుణం సేకరించడం! అయితే… `ఈ ప్రైవేటు ట్రస్టు ఎవరిది,` ఏపీ సర్కారుకే ఎందుకు అప్పు ఇస్తా నంటోంది?- అనే అంశాన్ని ప్ర‌స్తావించారు. దీంతో ఈ మొత్తం స్టోరీకి భారీ ఎత్తున ప్రాధాన్యం పెరిగిపో యింది. ఎక్క‌డో ఏదో జ‌రిగిపోతోంద‌ని ఈ వార్త‌ను చ‌దివిన వారు కూడా అనుకున్నారు. తీరా మొత్తం వార్త చ‌దివిన త‌ర్వాత‌.. ఈ ద‌మ్మున్న ప‌త్రిక‌.. డాంబికాలు ఎక్క‌డా క‌నిపించ‌లేదు.

ప్ర‌భుత్వానికి అప్పు ఇస్తామ‌న్న ట్ర‌స్టు ఏదో రాయ‌లేదు.. ఏపీ స‌ర్కారుకే ఆ ట్ర‌స్టు ఎందుకు అప్పిస్తానందో కూడా చెప్ప‌కుండానే.. మొత్తం వార్త‌ను చుట్టేశారు. ఇదీ.. ఈ ద‌మ్మున్న ప‌త్రిక ప‌నితనం. ప‌నిలేనోడు.. చివ‌రికి ఏదో చేసిన‌ట్టు.. గా ఉంది ఈ రాత‌ల ప‌రిస్థితి! ప‌రువు ప్ర‌భుత్వానికి కాదు.. ఈ ప‌త్రిక‌కే పోయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version