ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు తుది అంకానికి చేరింది. తాజాగా 26 జిల్లాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఏ క్షణమైనా ఫైనల్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఫైనల్ డ్రాఫ్ట్ సిద్ధం అయింది. ఇప్పుడున్న 13 జిల్లాలను పునర్వ్యస్థీకరించి 26 జిల్లాలుగా చేయనున్నారు. అయితే రెండు రెవెన్యూ డివిజన్ల హెడ్ క్వార్టర్లను మార్చనుంది ప్రభుత్వం. అయితే దీనికి కేబినెట్ ఆమోదం తీసుకోనుంది. 26 జిల్లాలో 73 డివిజన్లతో ఫైనల్ గెజిట్ రానుంది. ప్రతీ జిల్లాలో కనీసం రెండు రెవెన్యూ డివిజన్లు ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఒక్కో రెవెన్యూ డివిజన్ లో కనీసం 8 మండలాలు ఉండేలా జిల్లాల ఏర్పాటు కానుంది.
ఏపీలో 26 జిల్లాలకు కేబినెట్ ఆమోదం… ఏ క్షణమైనా ఫైనల్ నోటిఫికేషన్
-