కాసేపట్లో ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. దాదాపు రూ.2.79 లక్షల కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఉదయం పది గంటలకు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెడతారు. వ్యవసాయ బడ్జెట్‌ను వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి సమర్పిస్తారు. శాసనమండలిలో బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి సీదిరి అప్పలరాజు ప్రవేశపెడతారు.
ఇప్పటికే నాలుగు సంవత్సరాలుగా మూలధన వ్యయం రూపంలో చేస్తున్న ఖర్చు చాలా తక్కువగా ఉంది. ప్రస్తుత ఏపీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త బడ్జెట్ రూపకల్పన సమయంలో ఆర్థికశాఖ అనేక ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో కీలక ప్రాజెక్టులకు, కీలక రంగాలకు నిధుల కేటాయింపు ఆశించిన స్థాయిలో ఉంటుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.