ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి నేడు అసెంబ్లీలో ప్రవేశ పెడుతారు. కాగ బడ్జెట్ అన్ని వర్గాలకు న్యాయం చేకురేలా ఉంటుందని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. రాష్ట్రంలో చాలా సంక్షేమ పథకాలు ఉన్నాయి. వాటిని సమతుల్యత చేస్తునే ఇతర అభివృద్ధి పనులకు నిధులు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తుంది. కాగ ఈ సారి బడ్టెట్ లో నియోజక వర్గాల వారీగా.. ఎమ్మెల్యేలకు నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించినట్టు తెలుస్తుంది.
ప్రతి నియోజక వర్గం అభివృద్ధికి ప్రతి ఏడాది రూ. 2 కోట్ల నిధులను ప్రత్యేకంగా విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించినట్టు సమాచారం. అందు కోసం ఈ బడ్జెట్ లో ప్రత్యేకంగా పద్దులను కూడా కేటాయించినట్టు తెలుస్తుంది.
అయితే రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు అంత బాగా లేకున్నా.. ప్రజా సంక్షేమానికి వెనకడుగు వేయకూడాదని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అందు కోసం బడ్జెట్ ను భారీగానే ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ సారి బడ్జెట్ రూ. 2.50 లక్షల కోట్లు దాటే అవకాశం ఉందని తెలుస్తుంది.