మంచు విష్ణు కన్నప్పలో బాలీవుడ్ స్టార్ హీరో..

-

గత కొన్ని సంవత్సరాలుగా హిట్ కోసం ప్రయత్నిస్తున్న మంచు విష్ణుకి సక్సెస్ అందకపోవడంతో ఈసారి ఎలాగైనా మంచి విజయాన్ని అనుకోవాలని భావిస్తున్నాడు.మహా భారతం సీరియల్‌ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో విష్ణు మంచు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం భక్త కన్నప్ప. మంచు విష్ణు కి ఇది డ్రీమ్ ప్రాజెక్ట్‌. మోహన్ బాబు, ప్రభాస్,మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. పాన్ ఇండియా వైడ్‌గా రాబోతోన్న ఈ సినిమాని మోహన్ బాబు నిర్మిస్తున్నారు.ఇది వరకు ఎన్నడూ చూడని ఓ దృశ్యకావ్యంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అంచనాలున్నాయన్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే… పాన్-ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం ‘కన్నప్ప’లో బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ నటిస్తున్నారు. ప్రభాస్, ప్రభుదేవా, మోహన్ లాల్, శరత్ కుమార్ తదితరుల తర్వాత అక్షయ్ కుమార్ గ్రాండ్ ఎంట్రీ’ అంటూ పోస్ట్ చేశాడు.ఈ చిత్రంలో చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్ బాబు, మధు, బ్రహ్మానందం, ముఖేష్ రిషి, కుశాల్ తదితరులు కీలకపాత్రలలో నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news