Andhra Pradesh: కౌంటింగ్ ఎఫెక్ట్… వైన్ షాపుల వద్ద భారీ సంఖ్యలో మద్యం బాబులు

-

జూన్ 4వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ జరగనుంది. ఇక ఆ రోజునే ఎన్నికల ఫలితాలు అధికారికంగా వెలువడునున్నాయి. ఈ ఎన్నికల కౌంటింగ్ ను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్లుండి ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో జూన్ 3, 4, 5 తేదీల్లో మద్యం షాపులు మూసివేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.దీంతో ఆంధ్ర ప్రదేశ్ లోని మద్యం షాపుల వద్ద మందుబాబులు క్యూ కట్టారు. మందు కొనుగోలు చేసేందుకు భారీ సంఖ్యలో మద్యం ప్రియులు తరలిరావడంతో షాపుల వద్ద రద్దీ నెలకొంది. తిరిగి ఈ నెల 6వ తేదీ ఉదయం వైన్ షాపులు తెరుచుకోనున్నాయి.

ఇదిలా ఉంటే… దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలుపడ్డాయి.ఇక ఈ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు కొన్ని తెలుగుదేశం పార్టీ అధినేత నాయకత్వంలోని కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తుందని ప్రకటించగా మరికొన్ని సర్వేలు వైసిపి అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. మరి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఎల్లుండి వరకు వేచి చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news