ఏపీలో మద్యం ఉత్పత్తి తగ్గించాలని దీపక్ మిశ్రా ఆదేశాలు..!

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకే రోజు జరుగనున్న విషయం తెలిసిందే. మే 13న ఏపీలో ఎన్నికలు జరుగనున్నాయి. అయితే ఇప్పటి నుంచే ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులు ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే సీఎం జగన్ బస్సు యాత్ర నిర్వహిస్తూ.. మేమంతా సిద్ధం సభల్లో పాల్గొంటున్నారు.

మరోవైపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా తమ అభ్యర్థుల గెలుపుకోసం ప్రచారం చేస్తున్నారు. ఈనెల 16, 17 తేదీలలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా ప్రచారం నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఏపీలో మద్యం ఉత్పత్తిని తగ్గించాలని రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక పరిశీలకులు దీపక్ మిశ్రా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే గత 6నెలల్లో మద్యం క్రయ, విక్రయాలకు సంబంధించిన డేటాను తీసుకున్నారు. మద్యం షాపుల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. కొన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం కీలకం కావడంతో వీటిని అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు దీపక్ మిశ్రా.

Read more RELATED
Recommended to you

Exit mobile version