పురందేశ్వరి సహా రెండో రోజు నామినేషన్లు వేసిన ప్రముఖులు వీళ్లే

-

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు గానూ రెండో రోజు నామినేషన్ల పర్వం జోరుగా సాగింది. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వివిధ పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. దాదాపుగా అందరు అభ్యర్థులు భారీ ర్యాలీగా వెళ్లి నామపత్రాలు సమర్పించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి భువనేశ్వరి నామినేషన్ వేయగా.. హిందూపురంలో నందమూరి బాలకృష్ణ (టీడీపీ) నామపత్రాలు దాఖలు చేశారు. ఇక రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిగా దగ్గుబాటి పురందేశ్వరి (బీజేపీ) నామపత్రాలను ఎన్నికల అధికారికి సమర్పించారు.

మరోవైపు కొండపి టీడీపీ అభ్యర్థిగా డోలా బాలవీరాంజనేయ స్వామి, తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ (జనసేన), యర్రగొండపాలెంలో గూడూరు ఎరిక్సన్‌ (టీడీపీ), కావలిలో కావ్య కృష్ణారెడ్డి (టీడీపీ), నెల్లూరు గ్రామీణం నుంచి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (టీడీపీ) నామినేషన్‌ దాఖలు చేశారు. పాలకొల్లులో టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు వినూత్నంగా సైకిల్‌పై వెళ్లి నామినేషన్‌ దాఖలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news