కిషన్ రెడ్డి, అసదుద్దీన్, ఆర్ ప్రవీణ్..తెలంగాణలో రెండో రోజు భారీగా నామినేషన్లు

-

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నామినేషన్‌ దాఖలు ప్రక్రియ జోరుగా సాగుతోంది. వివిధ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్‌ దాఖలు చేశారు. భారీ ర్యాలీతో తరలి వచ్చి సంబంధిత అధికారులకు అందజేశారు. సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయగా.. హైదరాబాద్‌ లోక్‌సభ ఎంఐఎం అభ్యర్థిగా అసదుద్దీన్‌ ఒవైసీ నామపత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.

మరోవైపు కరీంనగర్‌ లోక్‌సభ బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన తరఫున కుటుంబ సభ్యులు నామపత్రాలను రిటర్నింగ్‌ అధికారికి అందజేశారు. , నాగర్‌కర్నూల్‌ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ నామినేషన్‌ దాఖలు చేశారు.

ఖమ్మం బీజేపీ అభ్యర్థి వినోద్‌రావు, పెద్దపల్లి కాంగ్రెస్‌ అభ్యర్థిగా గడ్డం వంశీ కృష్ణ, బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌, నిజామాబాద్‌ బీఆర్ఎస్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్‌, భువనగిరి సీపీఎం అభ్యర్థిగా ఎండీ జహంగీర్, బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్, మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా వంశీ చంద్‌రెడ్డి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news