వోటాన్ అకౌంట్ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన ఏపీ ప్ర‌భుత్వం… మొత్తం బ‌డ్జెట్ రూ.2.26 ల‌క్ష‌ల కోట్లు..!

-

ఇది బ‌డ్జెట్ స‌మ‌యం.. మొన్నీ మ‌ధ్యే కేంద్ర ప్ర‌భుత్వం వోట్ ఆన్ అకౌంట్ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఇవాళ ఏపీ ప్ర‌భుత్వం ఆ రాష్ట్ర బ‌డ్జెట్‌ను అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టింది. ఇది కూడా వోట్ ఆన్ అకౌంట్ బడ్జెటే. ఏపీ ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు ఆ రాష్ట్ర అసెంబ్లీలో బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్టారు. కాగా య‌న‌మ‌ల‌కు బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌డం ఇది మూడోసారి. ఇక 2019-20 సంవ‌త్స‌రానికి గాను ఏపీ ప్ర‌భుత్వం మొత్తం రూ.2.26 ల‌క్ష‌ల కోట్ల బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. గ‌తేడాదితో పోలిస్తే ఈ ఏడాది బ‌డ్జెట్ లో 18.38 శాతం పెరుగుద‌ల క‌నిపించింది. ఇందులో మొత్తం రెవెన్యూ వ్య‌యం రూ.1.80 ల‌క్ష‌ల కోట్లు ఉండ‌గా, ఆర్థిక లోటు అంచ‌నా రూ.32,390.68 కోట్ల‌కు చేరుకుంది. క్యాపిట‌ల్ వ్య‌యం రూ.29,596.33 కోట్లు కాగా, రెవెన్యూ మిగులు రూ.2099 కోట్లుగా ఏపీ ప్ర‌భుత్వం అంచ‌నాలు వేసింది. కాగా 2014-15 ఆర్థిక సంవ‌త్స‌రంలో ఏపీకి మొత్తం రూ.1,48,744 కోట్ల అప్పులు ఉన్న‌ట్లు మంత్రి య‌న‌మ‌ల అసెంబ్లీలో తెలిపారు. అయితే 2017-18 ఆర్థిక సంవ‌త్స‌రంలో అదే అప్పు రూ.2,23,706 కోట్ల‌కు చేరుకున్న‌ట్లు య‌న‌మల వెల్ల‌డించారు.

ఏపీ ప్ర‌భుత్వం ఆయా రంగాల‌కు గాను బ‌డ్జెట్‌లో చేసిన కేటాయింపులు ఇలా ఉన్నాయి…
✦ ఆర్థికశాఖకు రూ.51,841.69 కోట్లు
✦ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.35,182.61 కోట్లు
✦ జలవనరుల శాఖకు రూ.16,852.47 కోట్లు
✦ వ్యవసాయ రంగానికి రూ. 12,732.97 కోట్లు
✦ వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమానికి రూ.10,032.15 కోట్లు
✦ వృద్ధాప్య, వితంతు పింఛన్లకు రూ.10,401 కోట్లు
✦ బీసీ సంక్షేమానికి రూ.8,242.64 కోట్లు
✦ మున్సిపల్ శాఖకు రూ.7,979.34 కోట్లు
✦ హోం శాఖకు రూ.6397.94 కోట్లు
✦ రోడ్లు భవనాలు, రవాణా శాఖకు రూ.5,382 కోట్లు
✦ రెవెన్యూ శాఖకు రూ.5546.94 కోట్లు
✦ విద్యుత్, మౌలికవనరులకు రూ.5,473.83 కోట్లు
✦ రైతుల్ని ఆదుకునేందుకు అన్నదాత సుఖీభవ పథకం. దీనికి రూ.5వేల కోట్ల కేటాయింపు.
✦ పరిశ్రమలు, వాణిజ్య రంగానికి రూ.4114.92 కోట్లు
✦ గృహనిర్మాణానికి రూ.4079.10 కోట్లు
✦ ఆహార, పౌరసరఫరాల శాఖకు రూ.3763.42 కోట్లు
✦ ఉన్నత విద్యకు రూ.3,171.63 కోట్లు
✦ సెకండరీ విద్యాశాఖకు రూ.3171.63 కోట్లు
✦ పౌరసరఫరాలకు రూ.3,763.42 కోట్లు
✦ మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ రూ.3,408 కోట్లు
✦ బీసీ సబ్‌ప్లాన్‌కు రూ.16,226 కోట్లు
✦ ఎస్సీ సబ్‌ప్లాన్‌కు రూ.14,367 కోట్లు
✦ ఎస్టీ సబ్‌ప్లాన్‌కు రూ. 5,385 కోట్లు
✦ బీసీ కార్పోరేషన్ రూ.3000 కోట్లు
✦ పసుపు-కుంకుమ పథకానికి రూ.4000 కోట్లు
✦ పింఛన్ల కింద విభిన్న ప్రతిభావంతులకు రూ.2,133 కోట్లు
✦ యువజన సర్వీసులు, క్రీడలకు రూ.1982.74 కోట్లు
✦ సాధారణ పరిపాలనకు రూ.1117.56 కోట్లు
✦ ఐటీ, కమ్యూనికేషన్స్‌కు రూ.1,006.81 కోట్లు
✦ మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కింద రూ.1000 కోట్లు
✦ ప్రణాళికా విభాగానికి రూ.1403.17 కోట్లు
✦ మైనార్టీల సంక్షేమానికి రూ.1,304.43 కోట్లు
✦ కాపుల సంక్షేమానికి రూ.1000 కోట్లు
✦ మైనార్టీ సబ్‌ప్లాన్‌కు రూ.1,304 కోట్లు
✦ ముఖ్యమంత్రి యువనేస్తం పథకానికి రూ.1200 కోట్లు
✦ కార్మిక ఉపాధి కల్పనకు రూ.1225.75 కోట్లు
✦ డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రణాలు ఇవ్వడానికి రూ.1100 కోట్లు
✦ న్యాయ శాఖకు రూ.918.81 కోట్లు
✦ సామాజిక సౌకర్యాలకు ఎస్సీ కాంపోనెంట్ నుంచి రూ.600.56 కోట్లు
✦ ఆహార శుద్ధి పరిశ్రమల కోసం రూ.300 కోట్లు
✦ పశుగ్రాసానికి రూ.200 కోట్లు
✦ పశువులపై బీమా రూ.200 కోట్లు
✦ బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.100 కోట్లు
✦ క్షత్రియుల సంక్షేమానికి రూ.50 కోట్లు
✦ ఆర్యవైశ్యుల సంక్షేమానికి రూ.50 కోట్లు
✦ నిరుద్యోగ భృతి వెయ్యి నుంచి రూ.2 వేలకు పెంపు
✦ డ్రైవర్ల సాధికార సంస్థకు రూ.150 కోట్లు
✦ ఇళ్ల స్థలాల సేకరణకు రూ.200 కోట్లు
✦ విత్తనాభివృద్ధికి రూ.200 కోట్లు
✦ చంద్రన్న బీమా పథకానికి రూ.354 కోట్లు
✦ అన్నా క్యాంటిన్లకు రూ.300 కోట్లు
✦ చంద్రన్న పెళ్లి కానుక కింద బీసీలకు రూ.175 కోట్లు
✦ చంద్రన్న పెళ్లి కానుక కింద ఎస్సీలకు రూ.128 కోట్లు
✦ మైనారీటీల దుల్హన్ పథకానికి రూ.100 కోట్లు
✦ ఎన్టీఆర్ విదేశీ విద్య పథకానికి రూ. 100 కోట్లు
✦ రాజధాని ల్యాండ్ పూలింగ్‌కు రూ.226 కోట్లు
✦ ఏపీ రైల్వే లైన్‌కు రూ.180 కోట్లు
✦ రియల్ టైం గవర్నెన్స్‌కు రూ.172.12 కోట్లు
✦ స్కిల్ డెవలప్‌మెంట్‌కు రూ.458 కోట్లు
✦ శాసనసభ వ్యవహారాల శాఖకు రూ.149.90 కోట్లు
✦ 8, 10 తరగతుల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకానికి రూ.156 కోట్లు
✦ దివ్యాంగుల సంక్షేమానికి రూ.70 కోట్లు
✦ 308 కాపు భవనాల నిర్మాణానికి రూ.123 కోట్లు

Read more RELATED
Recommended to you

Exit mobile version