కష్టపడిన ప్రతీ ఒక్కరినీ గుర్తిద్దాం.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

-

జనసైనికులు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కష్టపడిన ప్రతీ ఒక్కరిని గుర్తిస్తామని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  అన్నారు. జనసేన కార్యాలయంలో వైసీపీ నాయకులు  పార్టీ కండువా కప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ వారిని స్వయంగా పార్టీలోకి ఆహ్వానించారు.  అనంతరం  పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఏ ఆశ లేని సమయంలో పార్టీకి అండగా నిలిచేందుకు పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ హరిప్రసాద్ జనసేనలో చేరారని తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో వారు నాతో అండగా నిలబడి
పార్టీ బలోపేతం చేసేందుకు కృషిచేశారని అన్నారు.

ఒక లక్ష్యం కోసం మేము అందరం పనిచేస్తున్నామని, ఈరోజు మా మీద నమ్మకంతో వచ్చి పార్టీలో
చేరిన వారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నామని చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలు పెట్టుకున్న నమ్మకం నిజం చేయడానికి పని చేస్తున్నామని అన్నారు. అప్పుల ఊబిలోకి కూరుకుపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నామని, ఈ క్రమంలో మాకు అండగా ప్రతీ ఒక్కరూ నిలబడాలని కోరారు. ఇక పార్టీ కోసం కష్టపడిన ప్రతీ ఒక్కరినీ గుర్తించామని.. కార్యకర్తలు పని చేయండి అని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version