తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 06 గంటల సమయం పడుతోంది. ఇవాళ ఉదయం 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 76, 213 మంది దర్శించుకున్నారు. అలాగే.. నిన్న ఒక్క రోజే…తిరుమల శ్రీవారికి 19, 477 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.88 కోట్లుగా నమోదు అయింది.
ఇక అటు కర్నూలు మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో నేటి నుంచి గురుభక్తి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఐదు రోజుల పాటు శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతాయి. 12న 403 వ శ్రీ రాఘవేంద్రస్వామి పట్టాభిషకోత్సవం, 16 న శ్రీ రాఘవేంద్రస్వామి 409 వ జన్మదిన వేడుకలు ఉన్నాయి. గురుభక్తి ఉత్సవాలు పురస్కరించుకుని నేడు స్వామి వారి మూలబృందావనంకు తులసి అర్చన, కనకాభిషేకం, పంచామృతభిషేకం వంటి విషేశ పూజలు.