కేంద్రం నుంచి ఏపీకి 1000 బస్సులు.. మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

-

కేంద్రం నుంచి ఏపీకి 1000 బస్సులు రానున్నట్టు ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే కాలంలో ఏపీఎస్ఆర్టీసీ లో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై సమీక్షించాం.  సీఎం రివ్యూ లో మా అధికారుల పలు సూచనలు, ఫ్రీ బస్సుల అంశంపై చర్చించడానికి ఇవాళ సమీక్షించాం.  యాక్సిడెంట్ ఫ్రీ ఏపీ ని తయారుచేసేలా మా ప్రణాళికలు చేస్తున్నాం. ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందించాలని నిర్ణయించాం. ఏపీఎస్ఆర్టీసీ లో గత ఐదేళ్ళలో పూర్తిగా నాశనం చేసారు. ఏపీఎస్ఆర్టీసీ బలోపేతం చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నాం. విడతల వారీగా బస్సులు కొంటాం. దానికి తగిన డ్రైవర్లు, కండక్టర్లను ఇస్తాం.

జగన్ ఏపీఎస్ఆర్టీసీ ని విలీనం చేసాక కారుణ్య మరణాల విషయంలో న్యాయం చెయ్యలేదు. ఏపీఎస్ఆర్టీసీ ప్రజా జీవనలో ఒక భాగం అయిపోయింది. బోర్డర్ చెక్ పోస్టులు మూసేసారు. గతంలో ఇప్పుడు ఎన్ఫోర్సుమెంట్ ను ఏర్పాటు చేసి చెకింగ్ లు చేపడతాం. జంతువులు, ఖనిజాలు, రేషన్ బియ్యం గతంలో అక్రమంగా రవాణా చేసేసారు. సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం కావాలని నిర్ణయించాం. ఎలక్ట్రిక్ బస్సులు అత్యధికంగా తీసుకురావడానికే యోచన చేసాం. కేంద్రం ఇచ్చే వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు మనకు వస్తాయి అని తెలిపారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news