త్వరలో 1000 పోస్టుల భర్తీ : ఏపీ అటవీశాఖ ప్రకటన

-

ఆంధ్ర ప్రదేశ్‌ అటవీ శాఖ కీలక ప్రకటన చేసింది. అటవీశాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అటవీ శాఖ PCCF మధుసూదనరెడ్డి తెలిపారు. 50 రేంజర్లు, 200 సెక్షన్ ఆఫీసర్లు, 750 బీటు అధికారుల పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు.

1000 posts to be filled soon said AP Forest Department announcement

ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో 100చోట్ల నగర బనాలను నిర్మిస్తున్నామని, ఇందుకోసం రూ. 200 కోట్లు ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు.

అటు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో 6,511 పోలీస్ ఉద్యోగాల(6,100 కానిస్టేబుల్, 411 SI) భర్తీకి న్యాయపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. కోర్టు అనుమతి రాగానే కార్యచరణ ప్రారంభిస్తామన్నారు. త్వరలోనే ఎస్సై పరీక్షల తుది ఫలితాలను విడుదల చేస్తామని తెలిపారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిలిమ్స్ పూర్తి కాగా, ఈవెంట్స్ ఆగిపోయిన విషయం తెలిసిందే. తాజాగా హైకోర్టు ఆదేశాలతో ఎస్సై మెయిన్స్ రిజల్ట్స్ విడుదలయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news