తిరుమల శ్రీవారి సన్నిధి టిటిడిలో భారిగా ఉద్యోగుల పదవి విరమణ జరుగుతోంది. ఇవాళ ఒక్కరోజే 113 మంది ఉద్యోగుల పదవి విరమణ చేస్తున్నారు. ఇద్దరు డిప్యూటి ఇఓ స్థాయి ఉద్యోగులుతో పాటు అటెండర్ స్థాయి ఉద్యోగుల వరకు పదవి విరమణ చేయబోతున్నారు. దీంతో ఖాళిగా వున్న 5 డిప్యూటి ఇఓ పోస్టులు త్వరలోనే భర్తీ చేయనుంది టీటీడీ పాలక మండలి.
రూల్ ఆఫ్ రిజర్వేషన్ వివాదం కోనసాగుతు వుండడంతో ప్రమోషన్లు తాత్కాలికంగా నిలిపివేసింది టిటిడి. ఇక అటు తిరుమల టిటిడి ఇఓ శ్యామలరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. 2023 ఆగష్ట్ 7 వ తేది నుంచి 2024 మార్చి 11వ తేది వరకు జరిగిన 8 పాలకమండలి తీర్మానాలను టిటిడి వెబ్ సైట్ లో పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. టిటిడి పాలకమండలి నిర్ణయాలు పారదర్శకంగా భక్తులు ముందు వుంచాలని ఇఓ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు టిటిడి ఇఓ శ్యామలరావు.