వెంకయ్య నాయుడుపై మూడు పుస్తకాలు.. నేడు ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ

-

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 75వ పుట్టిన రోజు సందర్భంగా ఆయనపై రాసిన మూడు పుస్తకాలను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం (జూన్ 30వ తేదీ) ఆవిష్కరించనున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఆన్వయ కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ ఆ పుస్తకాలను విడుదల చేస్తారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ప్రధాని మోదీ విడుదల చేయనున్న పుస్తకాల్లో ది హిందూ పత్రిక హైదరాబాద్ ఎడిషన్ మాజీ ఎడిటర్ ఎస్ నగేశ్ కుమార్ రచించిన మాజీ ఉపరాష్ట్రపతి జీవిత చరిత్ర ‘వెంకయ్య నాయుడు- లైఫ్ ఇన్ సర్వీస్’ మొదటి పుస్తకం. రెండోది ‘సెలెబ్రేటింగ్ భారత్- ది మిషన్ అండ్ మెసేజ్ ఆఫ్ ఇండియా’ అనే టైటిల్తో ఆయన మాజీ కార్యదర్శి సుబ్బారావు సంకలనం చేసిన ఫొటో క్రానికల్. ఇక మూడో పుస్తకం ‘మాహానేత- లైఫ్ అండ్ జర్నీ ఆఫ్ శ్రీ ఎం వెంకయ్య నాయుడు’ పేరుతో సంజర్ కిషోర్ రచించారు. ఈ మూడు పుస్తకాలను ఇవాళ మోదీ ఆవిష్కరిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news