తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఇవాళ ఉదయం 30 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 68, 446 మంది దర్శించుకున్నారు. అలాగే.. నిన్న ఒక్క రోజే…తిరుమల శ్రీవారికి 28, 549 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.24 కోట్లుగా నమోదు అయింది.
అటు వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనార్థం భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల కోసం ఉచిత సమయ నిర్దేశిత సర్వదర్శనం (ఎస్‌ఎస్‌డీ ), రూ.300 ప్రత్యేకప్రవేశ దర్శనం (ఎస్‌ఈడీ) టికెట్ల కోటాను పెంచేందుకు చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి వెల్లడించారు. వేసవి రద్దీ నేపథ్యంలో వీఐపీలకు, శ్రీవాణి, టూరిజం, వర్చువల్ సేవ లకు కేటాయించే టికెట్లను తగ్గించి ఎస్‌ఎస్‌డీ, ఎస్‌ఈడీ టికెట్ల కోటా పెంచుతామని అధికారులు వివరించారు.