ఏపీ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త. ఏపీలో అదిరిపోయే ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది. సచివాలయాలకు అనుబంధంగా ఉన్న వైయస్సార్ రైతు భరోసా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 1,896 గ్రామ పశుసంవర్ధక సహాయకులు (విఏహెచ్ఏ) పోస్టుల భర్తీకి సోమవారం (నవంబర్ 20) పశుసంవర్ధక శాఖ నోటిఫికేషన్ జారీ చేయనుంది.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచే ప్రారంభమవుతుంది. దరఖాస్తు స్వీకరణ నవంబర్ 20వ తేదీ నుంచి డిసెంబర్ 11వ తేదీ వరకు కొనసాగనుంది. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. రాత పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు డిసెంబర్ 27న విడుదల చేయనున్నారు. డిసెంబర్ 31వ తేదీన కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహిస్తారు. ఎంపికైన వారికి జనవరిలో నియామక పత్రాలు అందిస్తారు. నెలకు వేతనం రూ.22,460 వరకు జీతంగా చెల్లిస్తారు.
అయితే ఎంపికైన తర్వాత మొదటి రెండేళ్లు ప్రొబేషన్ ఉంటుంది. ప్రొబేషన్ సమయంలో రూ. 15,000 చొప్పున కన్సాలిడేషన్ పే చేస్తారు. ఆ తర్వాత నుంచి నెలకు రూ.22,460 చొప్పున జీతం ఇస్తారు. అభ్యర్థులు 18 నుంచి 40 రెండేళ్ల మధ్య ఉండాలి. విద్యార్హతలు, ఇతర వివరాలు నోటిఫికేషన్ విడుదలైన తర్వాత తెలుసుకోవచ్చు. దరఖాస్తు రుసుము డిసెంబర్ 10వ తేదీలోగా చెల్లించాలి.