తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం

-

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్….తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. తిరుమలలో భక్తుల రద్దీ విపీతంగా పెరిగింది. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లు అన్ని నిండి వెలుపల క్యూ లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేచివున్నారు.

Tirumala
Tirumala Devotees Rush At Tirumala Temple On nov 16th

దీంతో టోకెన్ లేని భక్తులకు తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారిని 67,140 మంది భక్తులు దర్శించుకున్నారు. అటు నిన్న ఒక్క రోజే 26870 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.01 కోట్లుగా నమోదు అయింది. కాగా, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సామాన్య భక్తులకు పెద్దపీట వేయడం కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.

వైకుంఠ ఏకాదశి రెండు రోజుల ముందు నుంచి ద్వాదశి వరకు…. అంటే డిసెంబర్ 21 నుంచి 24వ తేదీ వరకు…. అదే విధంగా డిసెంబర్ 30 నుంచి 2024 జనవరి ఒకటో తేదీ వరకు దాతలకు వారి సిఫార్సు లేఖలతో వచ్చే వారికి గదుల కేటాయింపు ఉండదు. మిగతా రోజుల్లో దాతలు యధావిధిగా గదులు బుక్ చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. దాతలు భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టిటిడి కోరింది.

Read more RELATED
Recommended to you

Latest news