తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్…. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి… డిసెంబర్ 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు టీటీడీ ట్రస్టులు, స్కీముల దాతలకు కల్పిస్తున్న ప్రయోజనాల వివరాలు ఇలా ఉన్నాయి. ఆన్లైన్లో దర్శనం బుక్ చేసుకున్న దాతలను రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైన్ ద్వారా దర్శనానికి అనుమతి ఇస్తారని టీటీడీ తెలిపింది. దాతలు అందరికీ జయ విజయుల వద్ద నుంచి మహాలగు దర్శనం కల్పిస్తారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సామాన్య భక్తులకు పెద్దపీట వేయడం కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వైకుంఠ ఏకాదశి రెండు రోజుల ముందు నుంచి ద్వాదశి వరకు…. అంటే డిసెంబర్ 21 నుంచి 24వ తేదీ వరకు…. అదే విధంగా డిసెంబర్ 30 నుంచి 2024 జనవరి ఒకటో తేదీ వరకు దాతలకు వారి సిఫార్సు లేఖలతో వచ్చే వారికి గదుల కేటాయింపు ఉండదు. మిగతా రోజుల్లో దాతలు యధావిధిగా గదులు బుక్ చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. దాతలు భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టిటిడి కోరింది.