శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు

-

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి భారీగా భక్తులు పోటెత్తారు. మరో వారంలో పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పిల్లలతో సహా కుటుంబమంతా శ్రీవారిని దర్శించుకునేందుకు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ అంతకంతకూ పెరుగుతోంది. స్వామి వారి సర్వదర్శనానికి ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేకుండా గురువారం సాయంత్రానికి క్యూలైన్లలో వచ్చిన భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2లోని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయి రింగురోడ్డులోని శిలాతోరణం వరకు వేచి ఉన్నారు.

వీరికి దాదాపు 20 గంటల్లో శ్రీవారి దర్శనం లభించనుందని టీటీడీ అధికారులు తెలిపారు. రాత్రి శ్రీవారి పూలంగిసేవ, ఈరోజు తెల్లవారుజామున అభిషేకం నేపథ్యంలో క్యూలైన్‌లోని భక్తులకు  దర్శనం ఆలస్యం కానుందని వెల్లడించారు. మరోవైపు భారీగా తరలివస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని టీటీడీ అధికారులు వివరించారు. ఎండలు దంచికొడుతున్న దృష్ట్యా భక్తులకు మంచినీటి సదుపాయం కూడా కల్పించామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news