తెలంగాణ అధికారిక లోగోలో చార్మినార్ ఉండాల్సిందే : అసదుద్దీన్ ఒవైసీ

-

తెలంగాణ రాష్ట్ర నూతన చిహ్నంలో రాచరికపు ఆనవాళ్లు తొలగిస్తామని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే పాత లోగో నుంచి చార్మినార్, కాకతీయ తోరణం తొలగిస్తారనే ప్రచారం సాగుతోంది. దీనిపై ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. హైదరాబాద్ నగరానికి ఐకానిక్ సింబల్గా నిలిచిన చార్మినార్ను లోగో నుంచి తొలగించడమంటే హైదరాబాదీలను అవమానించడమేనని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అన్నారు. ఇక ఇప్పుడు దీనిపై ఎంఐఎం పార్టీ కూడా స్పందించింది.

తెలంగాణ అధికారిక లోగోలో చార్మినార్ ఉండాల్సిందేనని ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. చార్మినార్ తెలంగాణ సంస్కతికి, చరిత్రకు నిదర్శనం అని ఒవైసీ అన్నారు. రాజ చిహ్నంలో చార్మినార్ ఉంటుందని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి నెమ్మదించిందని.. రోడ్డు విస్తరణ, నైట్ బజార్, పార్కింగ్, బస్టాండ్, సర్దార్ మహల్, రేనోవేషన్ లాంటి పనులు త్వరగ పూర్తి చేయాలని కోరుతున్నానని ఒవైసీ ఎక్స్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news