ఏపీ, తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. తెలంగాణ, ఏపీకి 4 రోజులు వర్షాలు ఉన్నాయి. నైరుతి బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడనుంది. ఈ నెల 24వ తేదీకి అంది వాయుగుండంగా మారి….ఆ తర్వాత తుఫానుగా బలపడే అవకాశం ఉంది.
అనంతరం ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాలవైపు పయనిస్తుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే ఏపీకి తుఫాను ముప్పు లేదని భావిస్తున్నారు. అల్పపీడనం ఏర్పడిన తర్వాతే దీనిపై స్పష్టత వస్తుందన్నారు. అటు ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో 3-4 రోజులు వర్షాలు కురవనున్నాయి.