BREAKING : పవన్ కళ్యాణ్ కు 41 A నోటీసులు..అరెస్ట్ తప్పదా !

-

BREAKING : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ఊహించని షాక్‌ తగిలింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. :పవన్ కళ్యాణ్ తో పాటు నేతలకు 41 A నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఇవాళ సాయింత్రం 4 గంటలోగా నగరం/ హోటల్ నుండి వెళ్లిపోవాలన్నది నోటీసు సారాంశం అని సమాచారం అందుతోంది.

ఒక వేళ హోటల్‌ నుంచి వెళ్లకపోతే.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు స్కెచ్‌ వేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే.. పోలీసులతో జనసేన పార్టీ నేతలు చర్చలు కొనసాగుతున్నాయి. పోలీసులు ఇచ్చే నోటీసులు తీసుకొనే యోచనలో పవన్ కళ్యాణ్‌ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు… మీడియా సమక్షంలో తీసుకుంటానని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. విశాఖ టూర్‌ హాట్‌ టాపిక్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news