జగన్ కొత్త కేబినేట్ ఫైనల్ అయింది. ఎన్నో సమీకరణాలు, ఇంకెన్నో కూడికలు, ఎన్నో తీసివేతల మధ్య జగన్ నూతన కేబినేట్ కూర్పు ఫైనల్ అయిపోయింది. మొత్తం 25 మందిని కొత్త కేబినేట్ లోకి తీసుకున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. నూతన మంత్రి వర్గం నేడు ఉదయం 11.30 గంటలకు కొలువుదీరనుంది.
అయితే.. ఈ కొత్త కేబినేట్ లో ఏకంగా 11 మంది పాత వారే కావడం విశేషం. ఇది ఇలా ఉండగా.. ఏపీలో ఈ సారి కూడా ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉండనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు వర్గాలకు ఉప ముఖ్యమంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది.
మైనారిటీ నుంచి అంజాద్ బాషా డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం ఉండగా… ఎస్టీ వర్గం నుంచి పీడిక రాజన్న దొర కానున్నారు. ఎస్సీ నుంచి నారాయణ స్వామి లేదా పినెపి విశ్వరూప్ లేదా వనిత కానుండగా.. బీసీ నుంచి ధర్మాన ప్రసాదరావు లేదా బొత్సకు ఛాన్స్ ఉంది. కాపు సామాజిక వర్గం నుంచి అంబటి రాంబాబు లేదా దాడిశెట్టి రాజాకు అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.